Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటు: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
నవతెలంగాణ- కొడంగల్
టీఎస్ యూటీఎఫ్ దౌల్తాబాద్ మండలాధ్యక్షులు నాణ్యనాయక్ మృతి ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జంగయ్య, చావ రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డి అన్నారు. నాణ్యనాయక్ సేవలను కొనియాడారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాణ్యనాయక్ మృతి చెందగా.. ఆయన స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బోడమర్రిగడ్డ తండాలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి, సంఘం రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు జంగయ్య, చావ రవి, రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం, దౌల్తాబాద్ జడ్పీటీసీ మహిపాల్, ఎంపీపీ విజరుకుమార్, ఉపాధ్యాయులు పాల్గొని నివాళులర్పించారు.