Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గాంధీ ఆస్పత్రి ఆధునీకరణ పనులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆస్పత్రి పర్యటన అనంతరం అక్కడి సమస్యల పరిష్కారానికి పూనుకున్నారు. ఆ ఆస్పత్రి ఆధునీకరణ పనులకు అవసరమైన నిధులు విడుదల చేయించారు శానిటేషన్ వ్యవస్థ పునర్వస్థీకరణ కోసం రూ.14.56 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం జీవో నెంబర్ 649 ద్వారా విడుదల చేసింది. దీంతో గాంధీ ఆసుపత్రిలోని శానిటేషన్ సిస్టం మెరుగపడనుందని అధికారులు అభిప్రాయపడ్డారు. డ్రైనేజ్ వ్యవస్థ పాతది కావడంతో డ్రైన్ వాటర్ సెల్లార్ లోకి రావడం, వాష్ రూంలు బ్లాకేజి కావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శానిటేషన్ వ్యవస్థను పునర్వవ్యస్థీకరించడం వల్ల శాశ్వతంగా ఈ సమస్య తొలగనుందని వారు వివరించారు. గాంధీ ఆసుపత్రిలో నాలుగు లిఫ్ట్ లు ఏర్పాటుకు ఈ నెల 29 వ తేదీన ప్రభుత్వం రూ.ఒక కోటి 62 లక్షలు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 648 ను విడుదల చేసింది. దీంతో వైద్య సిబ్బందికి, రోగులకు లిఫ్ట్ సౌకర్యం కలగనుంది.