Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి,
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవితంలో నిజాయితీ, కఠోర శ్రమ, వినయం ఉన్న వ్యక్తులే మనకు ఆదర్శంగా నిలుస్తారని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి అన్నారు. సోమవారం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలు-2022 ప్రారంభ కార్యక్రమంలో ఎల్. నరసింహారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చంద్రిమా రారు ఈ సభకు అధ్యక్షత వహించారు. అవినీతిని పారద్రోలాలంటే బలమైన సంకల్ప శక్తి ఒక్కటే పరిష్కారమని అన్నారు. దేశాన్ని ఏకం చేయడంలో కీలకపాత్ర పోషించిన వల్లభారు పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కూడా జరుపుకుంటామని వివరించారు.