Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏడో తేదీ వరకు జరగనున్నాయి. అయితే మనుగోడు ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి, ఇతర కారణాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చేనెల తొమ్మిది నుంచి 16వ తేదీ వరకు ఈ పరీక్షలను విద్యాశాఖ అధికారులు నిర్వహిస్తారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షలను ఆరు పేపర్లు కాకుండా 11 పేపర్లతో జరగనున్నాయి. అయితే ఎస్ఏ-1 పరీక్షల వరకే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత ఎస్ఏ-2తోపాటు ప్రీఫైనల్, వార్షిక పరీక్షలను మాత్రం ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు గతంలోనే స్పష్టం చేశారు.