Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యాశాఖ, పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ ఎ వాణీప్రసాద్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. విద్య, పరిశోధన, శిక్షణ, విద్యార్థులు, సిబ్బం ది సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఈ రెండు సంస్థలు పనిచేస్తాయి. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.