Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్‌గాంధీకి పౌరహక్కుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపా చట్టాన్ని ఎత్తేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో రాహుల్‌గాంధీని సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. దేశద్రోహ చట్టాన్ని ఎత్తేయాలని కోరారు. రాజ్యాంగ హక్కులను కాపాడాలని సూచించారు. ఇందుకోసం హామీ ఇవ్వాలని తెలిపారు.