Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్టారో ఇండియా వెల్లడి
హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సంస్థ అట్టెరో ఇండియా రాష్ట్రంలో భారీ పెట్టుడులకు ముందుకు వచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. అట్టారో ఇండియా కంపెనీ రూ. 600 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందన్నారు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు సంతోషిస్తున్నానని తెలిపారు.
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎర్ర తివాచీ పరుస్తోందని అన్నారు. దీని ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుందని ట్వీట్లో పేర్కొన్నారు.. పరోక్షంగా చాలా మంది ఉపాధి లభించనుందన్నారు.