Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కు ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమ వారం నుంచి ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసె సింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్‌లైన్ సెంటర్లలో ధ్రువ పత్రాల పరిశీలనకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల ని సూచించారు. ఈనెల మూడు, నా లుగు తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. మూడు నుంచి ఆరో తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముం టుందని వివరించారు. తొమ్మిదిన తొలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈనెల తొమ్మిది నుంచి 13 వరకు ట్యూ షన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. త్వరితగతిన ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం https:// tseamcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదిం చాలని కోరారు.