Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్
- ఇతర ప్రాంతాల వారు వెళ్లిపోవాలి
- ఎక్కువ మంది అభ్యర్ధుల వల్లే తప్పిదాలు-సీఈవో వికాస్ రాజ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడులో మైకుల మోత, రోడ్లపై వాహనాల రద్దీ నేటితో ఆగనుంది. మంగళవారం సాయంత్రం 6గంటలకు ప్రచారం ముగుస్తుండటం తో అతిధి నాయకులంతా అద్దె ఇళ్లు ఖాళీచేసి వారి సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ మొదలు నేటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపిలతో పాటు బిఎస్పి, కెఎ పాల్ ప్రచారంతో మును గోడు వీధులు హోరెత్తాయి. బహిరంగ ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయకూడదని సిఇవొ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గానికి చెందని వారు ప్రచార సమయం ముగిసి న తరువాత అక్కడ ఉండకూడదని సూచిం చారు. సోమవారం హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ఆయన మీడియాతో మాట్లా డారు. మును గోడు ఎన్నికల నిర్వహణలో జరిగిన తప్పిదాల్లో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదన్నా రు. ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉండ టంతో గుర్తుల విషయంలో పొర పాట్లు జరిగాయన్నారు. ఇద్దరు ఆఫీసర్లపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మంగళ వారం సాయంత్రం తర్వాత బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం ఉన్నట్లు వివరించారు. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుం దన్నారు. నియోజక వర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. వందశాతం పోలింగ్ స్టేషన్లు రాష్ట్ర పోలీసు, కేంద్ర బలగాల అధీనంలో ఉంటాయన్నారు. అర్బన్‌లో 35, రూరల్‌లో 263 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో 5686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే.. 739 మంది మాత్రమే అప్లై చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తైందన్నారు. 1192 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి సహా ముగ్గురు అధికారులు ఉంటారని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించా రు. మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు సిఇవొ తెలిపారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా, మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా ఇప్పటివరకు 479 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో 471 ఫిర్యాదు లపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సరైన పత్రాలు లేని రూ.6.80 కోట్ల నగదు ను సీజ్ చేశారు. 4988 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, 185 లిక్కర్ కేసులు బుక్ అయినట్లు వికాస్ రాజ్ వివరించారు.