Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ సహకార శాఖ కమిషనర్ వీరబహ్మయ్య సేవలు ప్రశంసనీయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. శాఖాపరమైన అంశాలకు సంబంధించి ఆయన ఎలాంటి చిక్కులు లేకుండా సహకరించారని చెప్పారు. సోమవారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో వీరబ్రహ్మయ్య పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
ఉద్యోగుల పదోన్నతులు, సహకార శాఖ ఎన్నికల నిర్వహణలో ఆయన పాత్ర గొప్పదన్నారు. ఆయన చేపట్టిన వీరబ్రహ్మయ్య తీసుకున్న కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ విధానం సమర్థవంతంగా అమలవుతున్నదన్నారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, అడిషనల్ రిజిస్ట్రార్ కిరణ్మయి, బాలరాజు, శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ ఎండీ యాదిరెడ్డి తదితరులు ఉన్నారు.