Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైలుకు పంపడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలంటూ ఆయన సతీమణి ఉషాభారు వేసిన కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. పీడీ యాక్ట్ నమోదు చేయడానికి మూడు కేసులు ప్రామాణికమనీ, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసుల ఆరోపణలను ఆమె తరఫున న్యాయవాది ఖండించారు. శాంతిభత్రదలకు విఘాతం కలిగించలేదనీ, ఏ మతాన్ని సైతం రాజాసింగ్ అగౌరపర్చేలా మాట్లాడలేదని వివరించారు. విచారణ మంగళవారం కొనసాగిస్తామని జస్టిస్ ఎ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె శ్రీదేవిల ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశించింది.
పబ్‌ల శబ్ధాలపై ఉత్తర్వుల్లో మార్పు
హైదరాబాద్‌లోని పబ్‌ల నుంచి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శబ్ధాలు వెలువడకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సవరించింది. జూబ్లీహిల్స్‌లోని నివాస ప్రాంతంలోని పబ్‌లకు మినహా ఇతర పబ్‌లకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్టు చెప్పింది.