Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తోంది. మొన్నటికి మొన్న ఎన్నికల కమిషన్ ఆంక్షలు.. నేడు మంత్రి వ్యక్తి సహాయకులైన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం ఉపసర్పంచ్ బసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. నల్లగొండలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోమవారం అర్ధరాత్రి వరకు సోదాలు చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెండ్రోజుల్లో జరగనున్న మునుగోడు శాసనసభ ఎన్నికల సమయంలో మంత్రి, వ్యక్తి గత సహాయకులు ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. జిల్లా మంత్రిగా మునుగోడు శాసనసభ ఎన్నికకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపొచ్చని అందిన ఫిర్యాదులతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలిసింది.