Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర బీసీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ ఉద్యోగుల పదోన్నతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో కోరారు. విద్యుత్ ఉద్యోగులకు 1998 నుంచి ఇచ్చిన ప్రమోషన్లపై సమీక్షా నిర్వహిం చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఉత్తర్వులు అమలు చేస్తే ఉద్యోగు లందరికి న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 నుంచి విద్యుత్ ఉద్యోగుల స్థానికత, విభజన సమస్యల వల్ల తెలంగాణాలో పుట్టి, పెరిగిన అనేక మంది ఉద్యోగులు యాజమాన్య అసమర్థత వల్ల గడచిన ఏడేండ్లలో ప్రమోషన్లతోపాటు ఆర్థికంగా ఎంతో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్లపై కోర్టు ధిక్కరణ కేసులు, కోర్టులు, న్యాయవాదులు, న్యాయ సలహాదారుల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.10 వేల కోట్లు వధా ఖర్చు చేసారని ఆరోపిం చారు. ఉద్యోగులను ఖాళీగా కూర్చోబెట్టి సంవత్సరాల తరబడి జీతాలు చెల్లించారని విమర్శించారు. ఇకనైనా విద్యుత్ సంస్థల్లో చట్టబద్ధ పాలన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.