Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖజానా శాఖ డైరెక్టర్‌కు టీఎస్సీపీఎస్ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయు లకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) బకాయిలను విడుదల చేయా లని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూని యన్ (టీఎస్సీపీఎస్ ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ శ్రీరామచంద్రమూర్తిని మంగళవారం హైదరాబాద్‌లో ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు మ్యాన పవన్‌కుమార్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది జనవరి 19న జీవో నెంబర్ మూడు ద్వారా సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను మూడు విడతల్లో చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు.
కానీ ఇప్పటివరకు సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మూడు విడతల్లో రావాల్సిన డీఏ బకాయిలకు సంబంధించి ఎలాంటి చెల్లింపు జరగలేదని తెలిపారు. వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, నాయకులు కోటకొండ పవన్ తదితరులు పాల్గొన్నారు.