Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
- టి-హబ్‌ను సందర్శించిన ఐఏఎస్‌ల బృందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో స్టార్టప్‌ల అభి వృద్ధికి అనుకూల వాతావరణా న్ని పెంపొందిస్తామనీ, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సమర్థత, జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడమే కాకుండా ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగు పరిచేందుకు కూడా ఈ నూతన ఆవిష్కరణలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ టీ హబ్‌ను మంగళవారం 40 మంది సీనియర్ ఐఏఎస్‌లతో కూడిన బృందం సందర్శించింది. సీఎస్ సోమేశ్ కుమార్ ఈ పర్యటనను ఏర్పాటు చేశారు. టి హబ్‌లోని పలు ఇన్నోవేషన్ కేంద్రాలైన వి హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ తెలంగాణ (రిచ్), ఇమేజ్ తదితర కేంద్రాలను ఆ బృందం ఈ సందర్భంగా పరిశీలించింది. అక్కడి నిపుణులు రూపొం దించిన పలు ఆవిష్కరణలను అధికారులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలు ఉపయోగిం చుకునే సాంకేతికతలకు అనుగుణం గా ఆయా శాఖల్లో సర్వీస్ డెలివరీ వ్యవస్థను మెరుగు పరచడంలో నూతన ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని సూచించారు. తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకో గలరని ఆయన వివరించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ టి హబ్ ఇప్పటి వరకు వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను అందించిందని తెలిపారు. స్టార్టప్‌లు, ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటాదారులపై ప్రభావం చూపుతాయని వివరించారు. రెండు వేల కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్‌ల కు మెరుగైన సాంకేతికత, ప్రతిభ, సలహాదారులు, కస్టమర్లు, కార్పొరేట్, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ఏజెన్సీలకు టి హబ్ అందించిందని తెలిపారు. జాతీయ, అంతర్జా తీయంగా వివిధ సంస్థలతో టి హబ్ కలసి పనిచేయడం గురించి వివ రించారు. కార్యక్రమంలో ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులుు పాల్గొన్నారు.