Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన ఐదు డిఏ బకాయిల్లో మూడు చెల్లిస్తామని గతంలో ప్రకటించిన యాజ మాన్యం రెండు డిఏలకే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కార్మిక సంఘాలు స్పందించడంతో మంగళవారం మరో డిఏ కూడా చెల్లిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సకల జనుల సమ్మె కాలంనాటి వేతనాలు కూడా ఇస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ నెల మొదటి వారంలో ఇచ్చే వేతనాలతో కలిసి వీటిని చెల్లిస్తున్నట్టు బస్‌భవన్ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు మంగళవారమే వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు. బుధవారం మిగిలిన అన్ని జిల్లాల్లోని ఉద్యోగులకు మూడు డిఏల బకాయిలతో సహా వేతనాలు డిపాజిట్ చేస్తామన్నారు.