Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవీన్ మిట్టల్‌కు టిప్స్ ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధికార వికేంద్రీకరణతో ఇంటర్ విద్య బలోపేతమవుతుందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) తెలిపింది. విధానపరమైన నిర్ణయం తీసుకున్న ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్‌కు టిప్స్ కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కో కన్వీనర్లు బి.లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, లక్క స్వామి, మృత్యుంజయ, ఆనంద్, వస్కుల శ్రీనివాస్, ఎం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కెపి శోభన్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్ విద్యను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రక్షాళన ప్రారంభించి అధికార వికేంద్రీకరణను చేపట్టారని పేర్కొన్నారు. కమిషనర్‌కు ఉన్న అధికారాలను ఆర్జేడీలు, డీఐఈవోతోపాటు కాలేజీల ప్రిన్సిపాళ్లకు మార్పిడి చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని తెలిపారు. పనుల నిర్వహణలో అతి ముఖ్యమైన ఈ-ఆఫీస్, బయోమెట్రిక్ వంటి విధానాలను అమలు చేయడం వల్ల ఇంటర్ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు నాంది పలుకుతుందని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగులకు సదుపాయాలు సకాలంలో రావడంతో వారు ఎంతో ఉత్సాహంగా పనిచేసే అవకాశముంటుందనీ, ఇంటర్ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.