Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయానికి చికిత్స చేసిన వైనం
- చిన్నారిని కాపాడిన స్టాఫ్ నర్సు అనిత
నవతెలంగాణ- పెద్దకొత్తపల్లి
చెట్లపొదలో వదిలేసి వెళ్లిన ఆడపిల్లను స్థానికులు గమనించి కాపాడారు. సమయానికి చికిత్స అందించడంలో పసికందు ఆరోగ్యంగా ఉంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..
అప్పుడే పుట్టిన పసికందును పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ముళ్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. అటువైపు వెళ్లిన పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన మారేడు గోవిందు పసికందు ఏడుపు విని దగ్గరకెళ్లి చూశాడు. వెంటనే పసికందును తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ ఉన్న స్టాఫ్ నర్సు అనితకు అప్పగించాడు. వెంటనే చికిత్స అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అంతేకాదు ఉన్నతాధికారులకు, చిల్డ్రన్ వెల్ఫేర్ సంస్థకు తెలియజేశారు. స్థానికుడు గోవింద్‌ను, స్టాఫ్‌నర్సును వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది అభినందించారు. త్వరలోనే పసికందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తామని ఎస్ఐ రాము తెలిపారు.