Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34 మంది విద్యార్థుల సస్పెన్షన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పీసీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. కొత్త ఆశలతో యూనివర్సిటీ లోకి అడుగుపెట్టిన జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు హింసించారు. వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువవడంతో జూనియర్ విద్యార్థులు ఉత్తరాలు రాసి కంప్లైంట్ బాక్స్‌లో వేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 34 మంది సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే .. పశు వైద్య కళాశాలలో రెండవ, నాలుగో సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులు ఇటీవల కాలేజీలో చేరిన జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో నిత్యం వేధిస్తున్నారు. దాంతో జూనియర్ విద్యార్థులు కంప్లైంట్ రాసి బాక్స్‌లో వేసి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన వీసీ ఈ ర్యాగింగ్‌పై ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. సోమవారం కమిటీ నివేదిక ఆధారంగా సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. 34 మంది విద్యార్థులను సస్పెన్షన్ చేశారు. వీరిలో 25 మంది తరగతి గదులు, హాస్టల్ నుంచి మిగతా 9 మందిని హాస్టల్ నుంచి యూనివర్సిటీ వాహనాలను ఎక్కకుండా నిషేధించింది. ఇకనుంచి విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హాస్టల్ ఇన్చార్జి ప్రొఫెసర్ వెంకటరమణ స్పష్టం చేశారు.