Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలమని గవర్నర్ తమిళిసై అన్నారు. దేశంలో విభిన్న సంస్కృతులు, భాషలు ఉన్నా ప్రజలందరూ సహోదర భావంతో మెలగలటమే మనకు గర్వకారణమని చెప్పారు. జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఆర్మీ ప్రౌడ్ స్కాలర్స్ స్కూల్ విద్యార్ధులు 35 మంది స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆపరేషన్ సద్భావన కార్యక్రమంలో భాగమే స్టూడెంట్స్ ఎక్సేంజ్ అన్నారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జమ్మూ విద్యార్ధులు ఆరాష్ట్ర సంస్కృతిక కళా రూపాలను ప్రదర్శించారు. దేశ రక్షణలో అమరులైన సైనికులకు గవర్నర్ తమిళిసై నివాళులర్పించారు.
ప్రథమ చికిత్స మెళకువలు తెలుసుకోవాలి...
ప్రతి ఒక్కరూ ప్రథమచికిత్స మెళకువలు తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎమ్మెర్జెన్సీలో ప్రథమచికిత్స ప్రాణాలు కాపాడుతుందని అన్నారు.
సిపిఆర్ విధానంతో పాటు ప్రథమచికిత్సపై విస్తృతంగా అవగహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రథమచికిత్స అందించడంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... ఇటీవల విమాన ప్రయాణంలో మెడికల్ ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడికి తాను ప్రథమచికిత్స చేసి కాపాడిన తీరును గవర్నర్ వివరించారు. కార్యక్రమం నిర్వహించిన ఐఆర్సిఎస్ అధికారులను గవర్నర్ అభినందించారు.