Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరెక్టర్ అలోక్ కుమార్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుళ్ల ఫిజికల్ టెస్టులో అర్హత సాధించిన వారికి నేటి నుంచి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ అలోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ, కానిస్టెేబుళ్ల ఫిజికల్ టెస్ట్, మెయిన్ పరీక్షలకోసం తమ సంస్థల్లో శిక్షణ పొందిన 1,237 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 15బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిజికల్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్‌కోసం ఒక్కో సెంటర్లో 100మందికి ఉచిత శిక్షణను నేటి నుంచి ప్రారంభిచనున్నట్టు తెలిపారు. ప్రిలిమ్స్‌కు అర్హత సాధించి, బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకోని అభ్యర్థులు ఎస్ఐ,కానిస్టెబుల్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్, టీఎస్‌బీసీ స్టడీ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.