Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేసింది
- రాష్ట్ర సహకారం లేకే కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం: 'మీట్ ది ప్రెస్'లో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించట్లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. అన్ని ఎన్నికలలాగే ఆదీ సాధారణ ఎన్నికేనని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఆలస్యం అవుతున్నదని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రగతి భవన్ స్క్రిప్ట్ ఆధారంగానే ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం నడిచిందనీ, దానితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ముఖ్యమంత్రి సహా ఏ పదవినీ ఆశించట్లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లు ఇస్తామన్నారు. తాను పోటీ చేయాలో వద్దో అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి చేయకుంటే జీవో 51 ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టేననీ, చేనేతపై 5శాతం జీఎస్టీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ లు దొంగ నాటకాలాడుతున్నారని విమర్శించారు.
దేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఇతర పార్టీల ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని చెప్పారు. తెలంగాణకు మోడీ ఎం చేశారని విమర్శిస్తున్నారనీ, వరంగల్, కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ చేశారనీ, 6 వేల గ్రామాలకు ఫైబర్ నెట్ ఇస్తున్నారనీ తెలిపారు. రూ.100 కోట్లతో విమానం కొంటున్నారంటే ఎంత సంపాదించుకున్నారని ప్రశ్నించారు. ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు.