Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి సర్కారు లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాజోలిబండ కుడి కాలువ పనులను అడ్డుకోవాలని రాష్ట్ర సాగునీటి పారుదల, అభివృద్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ కృష్ణాబోర్డు చైర్మెన్‌ను కోరారు. ఈమేరకు మంగళవారం లేఖ రాశారు. కృష్ణానీటి వివాదాల ట్రిబ్యునల్‌కు సంబంధించి అవార్డ్ రాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయమైన గతంలో అనేకసార్లు లేఖలు రాసినట్టు గుర్తు చేశారు. అయినా ఆర్డీసీ కుడికాలువ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కేఆర్ఎంబీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయని వివరించారు. పునర్వీభజన చట్టంలోని సెక్షన్ 89 కింద జరుగుతున్న కృష్ణానీటి వివాదాల ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యేవరకు, సుప్రీంకోర్టులో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు ఆర్డీఎస్ డీపీఆర్ పరిశీలన ఆపాలని లేఖలో పేర్కొన్నారు.