Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో పేదలపై భారాలు
- ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు
- ఎంసీపీఐ(యూ) జాతీయ ఐదో మహాసభల పోస్టర్ అవిష్కరణలో గాదగోని రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని బీజేపీ చూస్తున్నదని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు. హైదరాబాద్‌లోని ఓంకార్ భవన్లో ఆ పార్టీ జాతీయ ఐదో మహాసభల పోస్టర్‌ను రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, పెద్దారపు రమేష్, వడ్త్యా సుఖరాం నాయక్, వనం సుధాకర్, కర్రా రాజిరెడ్డి, బి పురుషోత్తం, ఎర్ర రాజేశ్, గుండెబోయిన చంద్రయ్యలతో కలిసి మంగళవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జాతీయ ఐదో మహాసభలు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ నెల 12నుంచి 15వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ సభలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించనున్నట్టు చెప్పారు. మత విద్వేషాలను రెచ్చగొట్టటం ద్వారా దేశ విచ్ఛిన్నానికి మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఫాసిస్టు మతోన్మాద విధానాలు-వామపక్ష కమ్యూనిస్టు పార్టీల కర్తవ్యం అంశంపై ఈ నెల ఏడున సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు.