Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెట్రో రైల్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను పట్నం ఖండించింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం ప్రధాన కార్యదర్శి డీ.జీ.నర్సింహారావు ఒక ప్రకటన విడుదల చేశారు. 2010లో హైదరాబాద్ మెట్రోల్ రైల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ ఎంఆర్), ఎల్ అండ్ టీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కనీస ఛార్జీ రూ.8 నుంచి గరిష్టంగా రూ.19 మాత్రమే వసూలు చేయాల్సి ఉందని పేర్కొ న్నారు. అందుకు భిన్నంగా ఇతర భాగస్వాములను సంప్ర దించకుండా హెచ్ఎంఆర్ ఏకపక్షంగా కనీస ఛార్జీని రూ.10, గరిష్ట ఛార్జీని రూ.60కు పెంచిందని విమ ర్శించారు. అది చాలదన్నట్టు మెట్రో రైల్ ఛార్జీలను సమీక్షించేందుకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ధరలు పెంచకుండా చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.