Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైనీ, వీకే-7 ఓపెన్ కాస్ట్ గనులు మొదటు పెట్టండి :జీఎమ్లకు సింగరేణి సీఎమ్‌డీ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నైనీ, వీకే-7 ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి వెంటనే ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. నవంబర్ నెలలో రోజుకు కనీసం 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, రవాణా చేయాలని చెప్పారు. దీనికోసం తక్షణం కొత్త ఓబీ కాంట్రాక్టర్లతో పనులు ప్రారంభింపచేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీన్ని సాధించాలంటే నైనీ బొగ్గు బ్లాకు (ఒడిశా), వీకే-7 ఓపెన్ కాస్ట్ గనుల నుండి తక్షణమే ఉత్పత్తి ప్రారంభిస్తేనే సాధ్యమవుతుందన్నారు. బుధవారంనాడాయన హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, లక్ష్యాలను నిర్దేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దిష్టమైన ప్రణాళికతో లక్ష్యాలు సాధించేలా చూడా లని చెప్పారు. కొత్తగూడెం, భూపాలపల్లి, శ్రీరాం పూర్, బెల్లంపల్లి ఏరియాల్లో పనులు మందకొడిగా ఉన్నాయనీ, వేగం పెంచాలని ఆదేశించారు. సమా వేశంలో డైరెక్టర్ (ఆపరేషన్, పా) ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం, ఫైనాన్స్) డి.సత్యనారాయణ రావు, అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, జీఎం(సీపీపీ) సిహెచ్ నరసింహారావు, జీఎం(మార్కెటింగ్) ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.