Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిసెంబర్ 11న ఫ్రీడం హైదరాబాద్ 10కె రన్ నిర్వహించనున్నట్టు సంబంధిత నిర్వహక కమిటీ వెల్లడించింది. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, జెమినీ ఎడిబిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి, యాక్ట్ ఫైబర్ కార్పొరేట్ ఎఫైర్స్ ఏజీఎం జావీద్ తదితరులు రన్‌కు సంబంధించిన బ్రోచర్, పోస్టర్‌ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమనీ, దానిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని కోరారు. ఈ రన్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగి తిరిగి పీపుల్స్ ప్లాజాకు చేరుకుంటుందని వెల్లడించారు.