Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నకిలీ నర్సుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అర్హత లేని నర్సులను ఉపయోగించి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దుస్థితికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన యునిక్ కార్డులను జారీ చేయాలని 2017లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నర్సులకు యునిక్ కార్డులను అందజేయడం ప్రారంభించారు. తొలి దశలో 15 వేల మందికి కార్డులను అందజేయనున్నట్టు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి తెలిపారు. ఒక సారి కార్డుల జారీ పూర్తి అయితే అర్హత లేని వారికి అడ్డుకట్ట పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.