Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సానుభూతి కోసం చిల్లర నాటకాలు : మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడులో ఓట్ల కోసం కోవర్టు రెడ్డి (కోమటిరెడ్డి) బ్రదర్స్ కొత్త డ్రామాలకు తెరతీయనున్నారని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఉప ఎన్నిక నేపథ్యంలో అనారోగ్య కారణమంటూ రాజగోపాల్‌రెడ్డి ఆస్పత్రిలో చేరతారనీ, సోదరుడికి పరామర్శ పేరిట వెంకటరెడ్డి సానుభూతి కోసం ప్రయత్నిస్తారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ది కోసం ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడటం దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ తదితరులతో కలిసి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయటాన్ని ఖండించారు. ఆయన కౌరవుల (బీజేపీ) పక్కనుండి శాంతి భద్రతల గురించి, ధర్మ యుద్ధం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వాన్ని రెండేండ్లుగా ఈటల ఇబ్బంది పెడుతూనే ఉన్నారని అన్నారు. మునుగోడుకు వెళ్లకుండా రాజేందర్‌ను, బీజేపీ నాయకులను ఎవరు ఆపారంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు అక్కడికొచ్చి అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.