Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
కాకతీయ యూనివర్సిటీ కార్మిక సంఘం నాయకుడు మెట్టు రవి బుధవారం సీఐటీయూలో చేరారు. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో సీఐటీయూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గాదె ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్, ఆఫీస్ బేరర్స్ టీ.ఉప్పలయ్య, బొట్ల చక్రపాణి సమక్షంలో రవి సీఐటీయూలో చేరారు. గతంలో యూనివర్సిటీ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి విజయం సాధించామని, తన మాతృ సంస్థ సీఐటీయూలో చేరడం ఆనందంగా ఉందని రవి అన్నారు. కార్మిక సమస్యల కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న సీఐటీయూ.. కార్మికులకు న్యాయం చేస్తుంది కాబట్టే మళ్లీ అందులోనే చేరుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. మెట్టు రవి సీఐటీయూలోకి రావడం సంతోషకరమన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిత్యం పోరాటాలు చేస్తుందని, రాబోవు కాలంలో యూనివర్సిటీ ఉద్యోగుల పర్మినెంట్, కనీస వేతనాల అమలు, ఈఎస్ఐ, పీఎఫ్ కోసం ఉద్యమాలు చేస్తుందని తెలిపారు.