Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు నిందితుల అరెస్ట్
- రూ.1,27,00,000, రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం
నవతెలంగాణ- సిటీబ్యూరో/అంబర్పేట్
గుట్టుచప్పుడు కాకుండా నల్లడబ్బులను (లెక్కల్లో చూపెట్టని) సరఫరా చేస్తున్న హవాలా ముఠాలోని ముగ్గురు నిందితులను హైదరాబాద్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. రూ.1,27,00,000, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..అంబర్‌పేట్‌కు చెందిన మన్నె శ్రీనివాస్, ఎం.జే మార్కెట్‌కు చెందిన సీ.విశ్వనాథ్ షెట్టి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కె.ఫనికుమార్ రాజు ఒక ముఠాగా ఏర్పడ్డారు. నగరంలో హవాలా దందాను కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఆర్. రాఘవేంద్ర డీసీపీ ఆదేశాలతో ప్రత్యేక నిఘా వేశారు. బుధవారం హిమాయత్ నగర్‌లోని రెమాండ్ షోరూం సమీపంలో ఎస్ఐ సాయికిరణ్‌తో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై అనుమానా స్పదంగా సంచ రిస్తున్న కె.ఫణికుమార్రాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హవాలా సొత్తును సరఫరా చేస్తున్నట్టు తేలడంతో తదుపరి విచారణ కోసం నిందితుడిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.