Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ''అభివృద్థి దేశం కోసం అవినీతిరహిత భారత్'' నినా ధంతో ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వాకథాన్ ను నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ వాకథాన్ను పీఎన్బీ హైదరాబాద్ జోనల్ హెడ్ మహ్మాద్ మక్సుద్ అలీ జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు విజిలెన్స్ చైతన్య వారోత్సవాల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో నగరంలోని తమ బ్యాంక్ ప్రధాన కార్యాలయా లు, శాఖల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపింది.