Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన లబ్ధిదారులకు హక్కుపత్రాలివ్వాలి : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోడు భూము ల సర్వే పారదర్శకంగా జర పాలని తెలంగాణ ప్రజా సం ఘాల పోరాట వేదిక ప్రభు త్వాన్ని డిమాండ్ చేసింది. అర్హులైన లబ్ధిదారులకు హక్కుపత్రాలివ్వాలని కోరింది. కుల వివక్ష వ్యతిరేక పోరాటం రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ అధ్యక్షతన తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కోఆర్డినేషన్ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్లో నిర్వ హించారు. ఇందులో వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య, తెలంగాణ వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య ఆర్ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బొప్పని పద్మ, పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి రమణ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పోడు భూముల సర్వేలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని తెలిపా రు. వాస్తవ లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా పోడు భూముల సర్వే పారదర్శకంగా జరిపి అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం పోడు భూములకు హక్కులు గుర్తించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు హక్కులివ్వాలంటూ వామపక్షాలు, గిరిజన, ప్రజాసంఘాల పోరాట ఫలితంగా గతేడాది పోడు భూములను సాగు చేస్తున్న సాగుదార్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిందని గుర్తు చేశారు. వాటి ఆధారంగా పోడు భూముల సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటూ రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వేలు చేయాల్సి ఉండగా అటవీ శాఖే ఇష్టారాజ్యంగా సర్వేలు చేస్తూ వాస్తవ పోడు సాగుదార్లకు హక్కులు రాకుండా అనేక ఇబ్బం దులు పెడుతున్నదని విమర్శించారు. గిరిజనులు, పేదలు అనేక ఏండ్లుగా సాగు చేస్తున్న పోడు భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టప్రకారం సర్వే చేసి సాగుదార్లకు హక్కులు గుర్తించాల్సి ఉండగా అటవీ శాఖ సర్వే చేయకుండా తిరస్కరించడం దుర్మార్గ మని విమర్శించారు. 2005, డిసెంబర్ 13 నాటికి సాగులో ఉన్న భూముల న్నిటికి పదెకరాలలోపు హక్కులు కల్పించాల్సి ఉండగా ఒక ప్రాంతంలో మాత్రమే హక్కు కల్పిస్తామనీ, మరోచోట సాగులో ఉన్న భూమిపై హక్కు కల్పించకుండా తిరస్కరించడం అన్యాయమని పేర్కొ న్నారు. చట్టంలో పేర్కొ న్నట్టు పదెకరాలలోపు ఎన్ని చోట్ల ఉన్నా సర్వే చేసి హక్కులు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేలాది గిరిజనులు పేదల కుటుంబాల్లో పెండ్లి చేసుకుని కుటుంబం నుంచి వేరుపడినా రేషన్ కార్డుల్లో మాత్రం ఉమ్మడిగానే పేర్లుంటు న్నాయని తెలిపారు. రేషన్ కార్డు ఉమ్మడిగా ఉన్నందున పోడు భూముల సర్వే గానీ, హక్కులివ్వడం కుదరదని చెప్పి ఆ దరఖాస్తులను సైతం తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు.