Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకి తిరుగు ప్రయాణం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ నూతన అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బుధవారం ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. నూతనంగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడైన ఆయన...తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొనడంతోపాటు నెక్లెస్‌రోడ్‌లో పార్టీ నిర్వహించిన బహిరంగసభలోనూ ఆయన ప్రసంగించారు. 2024లో రాహుల్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని క్యాడర్‌ను ఉత్సాహపరించారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, నదీమ్ జావిద్, బోసురాజు, మల్లు రవి, వి.హనుమంతరావు, హర్కర వేణుగోపాల్ తదితరులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.