Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణ : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు అనే అంశంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15న సెమినార్ను నిర్వహించారు. నిర్వహిస్తున్న రాష్ట్ర సెమినార్ పోస్టర్ను తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, పట్నం నాయకులు డీ.జీ.నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.శ్రీరాంనాయక్, ధర్మానాయక్, రైతు సంఘం శోభన్, వృత్తి సంఘాల నాయకులు ఎం.వి.రమణ, లెల్లెల బాలకృష్ణ, సంఘం నాయకులు బి.ప్రసాద్, బి.పద్మ ఆవిష్కరించారు. ఈ నెల 15న రవీంద్రభారతి మెయిన్ హాల్ లో ఉదయం 10.30 గంటల నుంచి సెమినార్ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేరళ రాష్ట్ర మంత్రి ఎం.బీ.రాజేష్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పాల్గొంటున్నారని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉపాధి హామీ కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. కార్మికులకు రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదన్నారు.