Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్ జీఓ కేంద్ర కార్యాలయంపై ఘటనకు సీఐటీయూ ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంపై బీజేపీ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం దాడికి పాల్పడటమే కాకుండా కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని వారు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తరహా అరాచక చర్యలను తెలంగాణ కార్మికవర్గం సహించబోదని తెలిపారు. ఈ దుశ్చర్యను ఉద్యోగ, ఉపాధ్యయ, కార్మిక సంఘాలు, ప్రజాతంత్రవాదులు నిరసించా లని కోరారు. రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఉద్యోగులు, ఉపాధ్యా యుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలను బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలే గత కొద్ది రోజులుగా అమానుషంగా దూషిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలనే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. బీజేపీపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.