Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ వాతావరణ మార్పులపై ఈనెల 7 నుంచి 10 వరకు దక్షిణాసియాలో జరగనున్న సదస్సులో ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు.ఆయనతోపాటు ఇండియా నుంచి మరో ఇద్దరుఎంపీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పార్లమెంట్, యూఎస్ఏఐడీ, షర్మ్-ఎల్-షేక్, ఈజిప్ట్ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ఇంధన భద్రత, వాతావరణ మార్పుల పరిష్కారానికి ద్వైపాక్షిక ఒప్పందాలకు అతీతంగా దక్షిణాసియాలో ప్రాంతీయ ఇంధన సహకారాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చనే దానిపై సంయుక్తంగా చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశమంటూ ఉత్తమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.