Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జీడిమెట్ల విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో గురువారం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం నిర్వహిస్తున్నట్టు డివిజినల్ ఇంజినీర్ (ఆపరేషన్) డీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారులకు సంబంధించి బిల్లింగ్, కొత్త కనెక్షన్లు, లో ఓల్టేజ్, మ్యూటేషన్ తదితర సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా హాజరై పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జీడిమెట్ల సబ్స్టేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.