Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గాంధీకి వీఆర్ పీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్టీ రిజర్వేషన్ పోరాటానికి మద్ధతివ్వాలని వడ్డెర రిజర్వేషన్ల పోరాట సమితి కాంగ్రెస్ పార్టీని కోరింది. ఈ మేరకు భారత్ జోడో యాత్రలో ఉన్న ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుంజి సంతోష్ కుమార్ వడ్డేరాజ్ కలిసి వినతిపత్రం సమర్పించారు.
వడ్డెరల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది సెస్ సర్వేలో వెల్లడైందని తెలిపారు. వడ్డెరలు విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడ్డారనీ, మిగిలిన సమాజంలో వారు కలిసేందుకు ఎస్టీ జాబితాలో చేర్చేందుకు మద్ధతివ్వాలని కోరారు. వివక్షకు గురైన ఎరుకల, యానాది, లంబాడ, కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి వడ్డెరలను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు.