Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తనను హత్య చేసేందుకు టీఆర్ఎస్ నాయకత్వ కుట్రలు చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దీనిలో భాగంగా పథకం ప్రకారమే మునుగోడులో తన కాన్వాయ్‌పై దాడి చేయించారని చెప్పారు. బుధవారంనాడిక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన శరీనం నుంచి ఒక్క రక్తపు బొట్టు కారినా దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో అవసరం లేకున్నా, అనేక మందికి గన్ లైసెన్సులు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో బయటకు వెళ్తే, ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందనీ, తన భార్య జమున సొంత ఊళ్ళో ప్రచారానికి వెళితే అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. తాను దేశాన్ని పాలిస్తున్న పార్టీలో సభ్యడిని అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలనీ, తనపై ఈగ వాలినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.