Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిమ్మాపూర్లో ద.మ.రైల్వే ప్రచార గ్రామసభ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రైల్వేలో ఉద్యోగావకాశాల పేరుతో జరిగే మోసాల పట్ల యువతీ, యువకులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెచ్చరించారు. నిఘా అవగాహన వారోత్సవాల్లో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే - హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో బుధవారం 'గ్రామ సభ' నిర్వహించారు. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పీ కోటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలో నియామకాలు పారదర్శకంగా జరుగుతాయనీ, డబ్బులకు ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మోసపూరిత మాటలకు లొంగి నష్టపోవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ క్రమాన్ని వివరించారు.