Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద.మ.రైల్వే పీసీసీఎమ్ జీ జాన్ప్రసాద్
నవతెలంగాణ-హైదరబాద్బ్యూరో
రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో ప్రకటనల ద్వారా రైల్వేకు మంచి ఆదాయం వస్తున్నదనీ, దాన్ని మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జీ జాన్ ప్రసాద్ తెలిపారు. బుధవారంనాడాయన జోన్ పరిధిలోని ప్రకటనకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వారి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిరు. రైల్వేస్టేషన్ ఆవరణలో డిజిటల్, స్టాటిక్ మీడియా ద్వారా అధిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రైల్వే స్టేషన్లు, ఇతర ఆవరణల్లోని ఖాళీ ప్రాంతాల్లో ప్రకటనలకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రయివేటు, ప్రభుత్వరంగ భాగస్వామ్యం ద్వారా ఇరువురూ ఆదాయం పెంచుకొనే దిశగా ప్రయత్నాలు సాగాలని ఆకాంక్షించారు.