Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన ఓటింగ్
- రాత్రి వరకు సాగిన పోలింగ్
- చండూరు, మర్రిగూడలో ఉద్రిక్తత
- పలుచోట్ల చెదురు ముదురు ఘర్షణలు
- ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్
- ఓటింగ్‌ను బహిష్కరించిన రంగం తండావాసులు
నవతెలంగాణ-మిర్యాలగూడ/ మునుగోడు నియోజకవర్గ విలేకరులు
దాదాపు రెండు నెలలుగా ఉత్కంఠ రేపిన నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ఘట్టం ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని చెదురు ముదురు ఘర్షణలు తప్ప పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు పెద్దఎత్తున తరలిరావడంతో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. దాంతో రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ సరళి సాగింది. చివరి ఓటు పోలయ్యే వరకు రాజకీయ పార్టీల కార్యకర్తలు దగ్గరుండి ఓట్లు వేయించారు.
మునుగోడు మండలంలో మూడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు, 4 వీవీప్యాట్లు మొరాయించగా వాటిని మార్చారు. చౌటుప్పల్ మండలం పెదకొండూరు, మునుగోడు మండ లం కొంపల్లి, నాంపల్లి మండలంలోని దేవతు పల్లి, రేఖ్య తండా గ్రామంలో ఈవీఎంలు మొ రాయించాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ పెట్టి నిఘా ఉంచారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలించారు. చండూరు, మర్రిగూడ మండలాల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. చండూరు మండలంలో సాయంత్రం జెడ్పీ హెచ్‌ఎస్‌లో పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరా రు. అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కుసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డి రాగా.. ఓటర్లను ఓట్లు అడుగుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం తెలపడంతో టీఆర్ఎస్, బీజేపీి కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ జరిగింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పీఏ పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతున్నారని సమా చారం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు అడ్డు కున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్య కర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెద రగొట్టారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధు లపై పోలీసులు జులుం చూపించడం తో వారు ఆందోళన చేశారు. మర్రిగూడలో ఉదయం ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదర గొట్టారు.
ఓటింగ్‌ను బహిష్కరించిన రంగం తండావాసులు
చౌటుప్పల్ మండలం రంగంతండా వాసులు ఓటింగ్‌ను బహిష్కరించారు. మొత్తం 350 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామాన్ని పంచాయతీగా మార్చి రోడ్లు వెయ్యాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా.. ఏ పార్టీ ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా నేతలు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటేస్తామని తండా వాసులు డిమాండ్ చేశారు.
భారీ బందోబస్తు
నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 15 కంపెనీల కేంద్ర బలగాలు, 3,366 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుగోడు మండలంలోని పలివెలలో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఈవీఎంలో అభ్యర్థుల భవితవ్యం
ఉప ఎన్నిక బరిలో 47 మంది పోటీ పడగా.. వీరందరి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.నియోజకవర్గంలో 2,41,805 ఓటర్లు ఉండగా 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి దాదాపు రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. దీంతో ఓటింగ్ శాతం పెరిగింది. బూతుల వారీగా నమోదైన ఓటింగ్‌ను అభ్యర్థు లు విశ్లేషించుకుంటూ గెలుపు ఓటములు బేరీజు వేసుకుంటున్నారు. పెరిగిన ఓటింగ్ వల్ల లాభనష్టాలను అంచనా వేస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు పోలింగ్ ముగిశాక ఈవీఎంలను సీజ్ చేసి కట్టుదిట్ట భద్రత నడుమ నల్లగొండలోని ఆర్జాలిభావి వద్ద ఉన్న స్ట్రాంగ్ రూములకు తరలించారు. కాగా ఈనెల 6న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
భారీగా నగదు పట్టివేత
ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. ఎలాగైనా గెలవాలని లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు పెద్ద ఎత్తున డబ్బు మద్యాన్ని పంచాయి. నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. డబ్బు పంపిణీ పై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఎన్ని కల్లో ఇప్పటివరకు 8.27 కోట్ల నగదు, 3.29 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నా రు. 6100 లీటర్ల మద్యం పట్టుకున్నారు. గతంలో 185 ఫిర్యాదులు రాగా, పోలింగ్ రోజు తాజా గా 98 ఫిిర్యాదులు వచ్చాయి. 70 మందిని స్థానికేతురులను గుర్తించి బయటికిి పంపారు.