Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ భూమిని పౌతికింద రిజిస్టర్ చేసేందుకు లంచం డిమాండ్
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
నవతెలంగాణ-రామారెడ్డి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇన్చార్జి తహసీల్దార్ కె.మానస, ధరణి ఆపరేటర్ లక్ష్మన్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. లంచం తీసుకుంటుండగా గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన మాండ్ల బలరాం వాళ్ల పెద్దమ్మ దన్నపు రాజవ్వకు వారసులు ఎవరూ లేకపోవడంతో.. ఆమె ఆలన పాలన బలరాం చూసుకున్నారు. ఆమె మరణించగా ఆమెకున్న రెవెన్యూ భూమిని పౌతి కింద బలరాం పేరుపై రిజిస్టర్ చేయాలని కోరాడు. మారుపేరులు వేరుగా ఉండటంతో ఇన్చార్జి తహసీల్దార్ కె.మానస రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. ఇందుకు గానూ రూ.5వేలకే డీల్ కుదుర్చుకోగా.. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి, ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో బాధితుడి నుంచి ధరణి ఆపరేటర్ సదానందపు లక్ష్మణ్ రూ.4వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇన్చార్జి తహసీల్దార్‌పై, ధరణి ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.