Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
- న్యాయమూర్తుల సంఘ ప్రతినిధులతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
న్యాయమూర్తులు నిర్భయంగా అంకితభావంతో పనిచేసి పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చెప్పారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు గురువారం చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్భుయాన్ను బంజరాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తుల సమస్యలను చీఫ్ జస్టిస్ అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో న్యాయమూర్తులు భయానికి, పక్షపాతానికి తావులేకుండా తమ విధులు నిర్వర్తించాలని, హైకోర్టు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తుల సంఘ ప్రతినిధులు చీఫ్ జస్టిస్‌ను సన్మానించారు. చీఫ్ జస్టిస్‌ను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘ అధ్యక్షులు, న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నర్సింగరావు, సంఘ ఉపాధ్యక్షులు కాళ్లూరి ప్రభాకర్‌రావు, సుదర్శన్, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ కె.మురళీమోహన్, సహాయ కార్యదర్శులు దశరథ రామయ్య, జె.ఉపేందర్‌రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మండ వెంకటేశ్వరరావు, అబ్దుల్జలీల్, ఎం.రాజు, భవాని, అప్సర్కౌసర్, ఉషశ్రీ, చందన, సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.