Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లలో 26 లక్షల లావాదేవీలు ఐ అండ్ పీఆర్ కమిషనర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూపరిపాలనలో ధరణి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలించింది. రెండేండ్లలో 26 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి దేశంలోనే తొలిసారిగా తెలంగాణాలో ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై రెండేండ్లు పూర్తయిందని పౌరసంబంధాల శాఖ తెలిపింది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక సిటిజెన్ ఫ్రెండ్లి ఆన్లైన్ పోర్టల్. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తున్నది.
ఇంటి వద్దకే సేవలు..
ధరణి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కేవలం 141 ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఈ వెబ్సైట్ ప్రారంభంతో రాష్ట్రంలోని 574 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వాటి సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. రిజిస్ట్రేషన్ల అనంతరం తమ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు కూడా జరిగేలా చర్యలు చేపట్టారు. అదేసమయంలో ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలు జనరేట్ కావడంతో పాటు దీనికి సంబందించిన సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా సిటిజన్లకు అందుతుంది. రిజిస్ట్రేషన్ జరిగిన వారం రోజుల్లోగా 18 సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన పట్టాదార్ పాస్ పుస్తకాన్ని పంపిణీ అవుతున్నది.
9.16కోట్ల హిట్స్..
ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌కు 9.16 కోట్ల హిట్స్ వచ్చాయి. 26 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వ్యవసాయ సంబంధిత లావాదేవీలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నసమస్యలు కూడా ఇందులో పరిష్కారమవుతున్నాయి. గతంలో 2.97 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగలేదు. ధరణి ప్రారంభంతో వీటికి పరిష్కారం లభించింది. భూ సంబంధిత 3.16 వివాదాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పటివరకు 11.24 లక్షల లావాదేవీలను ధరణి ద్వారా పూర్తి చేశారు. 2 .81 లక్షల గిఫ్ట్ డీడ్లను రిజిస్ట్రేషన్లు చేసింది. లక్షా 80 వేల మందికి సక్సేషన్ రైట్స్‌లను ధరణి ద్వారా అందించింది.
దేశానికే మార్గదర్శకం..
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పడంతోపాటు తమ భూములకు రక్షణ నెలకొన్నదనే సంతోషంతో రైతులు ఉన్నారు. రాష్ట్రంలో 70 లక్షల పట్టాదారులకు చెందిన కోటి 54 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రైతులందరూ ఏవిధమైన సమస్యలు లేకుండా రైతు బంధు పధకాన్ని పొందుతున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా సుల భంగా బదలాయింపుకు కూడా ధరణిలో వెసులుబాటు కల్పించారు. దీంతో, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియ ద్వారా పారిశ్రామి కాభివృద్ధికి తోడ్పాటు అందిం చినట్టుగా మారింది. ధరణి దేశంలోని పలు రాష్ట్రాలకు రానున్న కాలంలో మార్గ దరిశంగా మారుతుం దనడంలో ఏవిధ మైన సందేహం లేదని ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.