Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా పోలీసుల సాయంతో తమ పార్టీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసినా.. అక్కడ గెలిచేది మాత్రం బీజేపీనే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాడులకు వెరవకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఓటువేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ మద్యాన్ని ఏరులై పారించిందని, విచ్చలవిడిగా డబ్బును ఎరేసిందని తెలిపారు. కొందరు అధికారులు టీఆర్ఎస్కు గులాంగిరి చేశారని విమర్శించారు. వారి అంతు చూస్తామంటూ హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. మొదటి నుంచి ఈ విషయంపై తాము ఫిర్యాదుచేస్తున్నప్పటికీ ఈసీ పట్టించుకోలేదని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటం దారుణమన్నారు. సిద్ధిపేట నుంచి వచ్చిన 200 మంది గ్యాంగ్ ఈ అరాచకానికి పాల్పడిందని విమర్శించారు.