Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గత నెలరోజులుగా పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తరఫున ప్రచారం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సుపరిపాలనను ప్రచారం చేస్తూనే బీజేపీ కుట్రలను వారి తిప్పికొట్టటం అభినందనీయమన్నారు. ప్రచారం కోసం తమ సొంత గ్రామాలను వదలి మునుగోడులోనే ఉంటూ స్థానిక కార్యకర్తలను ఉత్సాహ పరిచిన నేతల కృషిని ఆయన ప్రశంసించారు. ఇదే సమయంలో వివిధ విభాగాల ఇంచార్జ్‌లు, సోషల్ మీడియా సైనికులకు అభినందనలు తెలిపారు.