Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 లక్షల మందిని చైతన్య పరిచాం
- రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సైబర్ సెక్యూ రిటీకి సంబంధించి 15 లక్షల మందిని చైతన్యపరిచామనీ, నెల రోజుల పాటు జరిగిన సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాంపులో భాగంగా ఈ లక్ష్యాన్ని చేరుకు న్నామని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. రాష్ట్రమేగాక దేశవ్యాప్తంగా సైబర్ దాడులు పెరిగాయనీ, సైబర్ నేరగాళ్ల భారి నుంచి ప్రజలను రక్షించ టానికి గత నెల రోజు లుగా అనేక కార్యక్రమాలను చేపట్టా మని ఆమె తెలిపారు. ముఖ్యం గా, ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ రుణ యాప్ మోసాలు, ఫేస్ బుక్, వాట్సప్ద్వారా మహిళలపై వేధింపులు, తదితర సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని విస్తృతం చేశామని చెప్పారు. ఇందులో భాగంగా సైబర్ నేరాలను వివరిస్తూ వాటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల కర పత్రాలను సమగ్ర వివరాలతో రూపొందించి మారుమూల ప్రాంతాల వరకు కూడా చేర్చామని ఆమె అన్నారు.