Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజాగోపాల్‌రెడ్డి విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు.తద్వారా ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి మత, కుల రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. గురువారం బుద్ధభవన్‌లో ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు టీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, రమేష్‌రెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు.
మునుగోడులో 15 బలగాలను మొహరించి, మోడీ, అమిత్‌షా రణరంగాన్ని సృష్టించినట్టు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి, బండి సంజరు ధర్నాలు చేసి, ప్రజల దృష్టి మళ్లించారని తెలిపారు. అరాచకాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు.